↦ SBI, ICICI, HDFC, Axis బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)శుభవార్త ప్రకటించింది. ఏటీఎంలో డ్రా చేయడానికి ఉన్న ఫ్రీ ట్రాన్సాక్షన్‌లలో మార్పులను వినియోగదారులకు వెల్లడించింది. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలో ప్రయత్నించి అది టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగానో, డబ్బులు లేకపోవడం వల్లనో, సరిపడ నోట్లు లేకపోవడమనే కారణంతోనే ట్రాన్సాక్షన్ ఫెయిలైతే అది ఫ్రీ ట్రాన్సాక్షన్‌లో కౌంట్ అవదంట.*
↦ ఈ విషయాన్ని వినియోగదారులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. మెట్రో సిటీల్లో అత్యధికంగా మూడు సార్లుకు మించి తీసుకోవడానికి వీల్లేదు. అదే నాన్ మెట్రో సిటీల్లో 5సార్ల వరకూ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఈ నియమాలను గ్రామీణ బ్యాంకులతో పాటు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకులు. జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకులు, ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు అన్నింటికీ వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.*
↦ ఆర్బీఐ విడుదల చేసిన స్టేట్‌మెంట్ హైలెట్స్:*
↦ 1. ఏటీఎంలలో డబ్బులు లేకపోయినా మరే ఇతర కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఆగిపోయినా ఫ్రీ ట్రాన్సాక్షన్‌లోకి రాదు*.
↦2. టెక్నికల్ కారణాల వల్ల ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయిన వాలిడ్ ట్రాన్సాక్షన్‌లోకి రాదు.*
↦3. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, కమ్యూనికేషన్ విషయంలో ఫెయిలైనా, తప్పుడు పిన్ ఎంటర్ చేసినా ఫ్రీ ట్రాన్సాక్షన్‌లోకి రాదంట.*
↦4. ఏటీఎం ట్రాన్సాక్షన్‌లలో బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్వెస్ట్, పిన్ ఛేంజ్లు ఫ్రీ 5 ట్రాన్సాక్షన్‌లోకి రావు.*
No comments:
Post a Comment